Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • కాజల్ కి అలాంటి దర్శకులతో చేయాలనుందట! 
  • లండన్ షూట్ కి వెళుతున్న మహేశ్ 
  • వచ్చే నెల నుంచి విజయ్ దేవరకొండ తమిళ చిత్రం 
  • బాబీతో నాగ చైతన్య ప్రాజక్ట్

*  'అలాంటి దర్శకులతో పనిచేయాలని వుంది' అంటోంది అందాలభామ కాజల్ అగర్వాల్. "ఇటీవల వచ్చిన 'అర్జున్ రెడ్డి', 'అ!' చిత్రాలు కొత్త జోనర్ కి చెందిన సినిమాలు. ఇలాంటి కాన్సెప్టులతో కొత్త దర్శకులు వస్తున్నారు. ఇవి నాకెంతో నచ్చాయి. ఇలాంటి దర్శకులతో పనిచేయాలని వుంది" అని చెప్పింది కాజల్.        
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో జరుగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను వచ్చే నెల మొదటి వారంలో లండన్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  'అర్జున్ రెడ్డి' సినిమాతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ తొలిసారిగా తమిళంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. స్టూడియో గ్రీన్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.
*  ప్రస్తుతం 'సవ్యసాచి', 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రాలలో నటిస్తున్న అక్కినేని నాగ చైతన్య తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు. 'జై లవకుశ' ఫేం బాబీ చెప్పిన కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 
Kajal Agarwal
Mahesh Babu
vijay

More Telugu News